బీఆర్ఎస్​లోకి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్!

-

తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచార వ్యూహాలను పదును పెడుతున్నాయి. ఓవైపు అభ్యర్థుల జాబితా.. మరోవైపు ప్రచార వ్యూహాలు.. ఇంకోవైపు ఓటర్లను ఆకర్షించే హామీలపై కసరత్తు చేస్తూనే.. చేరికలపైనా ఓ కన్నేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్​లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల నుంచి కీలక నేతలు కారెక్కుతున్నారు.

తాజాగా ఈ జాబితాలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి చేరబోతున్నట్లు సమాచారం. రావుల బీఆర్ఎస్​లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయనతో బీఆర్ఎస్​కు చెందిన ముఖ్య నేతలు చర్చించినట్లు తెలిసింది. ఈ నెల 15 లోగా ఆయన చేరికపై క్లారిటీ రానుందట.

వనపర్తి నుంచి 1994, 2009లో రావుల టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది.. 1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌గా పని చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడి టీడీపీ ముఖ్య నేతలు వివిధ పార్టీల్లో చేరినా.. రావుల మాత్రం ఆ పార్టీలోనే ఉంటూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. వనపర్తి జిల్లాలో ఇప్పటికీ రావులకు వ్యక్తిగతంగా మంచి పట్టు ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version