ఏపీలో జగన్ పాలన అద్భుతం అని క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న కొనియాడారు. ఇవాళ మార్నింగ్ న్యూస్ లో పాల్గొన్న తీన్మార్ మల్లన్న జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు తీన్మార్ మల్లన్న.

పాదయాత్రలో భాగంగా ఏపీలో కలిసిన ముంపు మండలాల్లో పర్యటించారని… జగన్ పాలన గురించి అక్కడి ప్రజలు బాగా చెప్పారని వెల్లడించారు. అమ్మ ఒడి, పెన్షన్లు మరియు రేషన్ బియ్యం ఇలా ప్రతి ఒక్కటి ఒకటో తారీకునే వస్తున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. వందల మందిని కలిస్తే ఒక్కరు కూడా జగన్ పాలన బాగాలేదని చెప్పలేదని వెల్లడించారు తీన్మార్ మల్లన్న. కెసిఆర్ చేతుల్లో తాము లేము కాబట్టి.. బతికిపోయామని టిఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలంటించారు.
Telangana Public about YS Jagan Govt 😍👌pic.twitter.com/OMHwtpQ5NW
— YS Jagan Trends™ (@YSJaganTrends) December 2, 2022