యూత్ స్కిల్ హబ్ గా తెలంగాణ.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణను యూత్ స్కిల్ హబ్ గా తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతనంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్ట తెలిసిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే తెలంగాణ యువతను మంచి నైపుణ్యం గలవారిగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.

పదిహేడు రకాల కోర్సుల్లో ప్రతి సంవత్సరం 20 వేల మంది స్టూడెంట్స్ కి శిక్షణ ఇచ్చి.. సర్టిఫికేట్ అందజేస్తామని తెలిపారు. అంతేకాకుండా పలు కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించేలా చూస్తూన్నామని తెలిపారు. తెలంగాణ స్కిల్ యూనివర్సీటీ ఛాన్స్ లర్ గా గవర్నర్ లేదా సీఎం ఉంటారని బిల్లులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఫ్యూచర్ లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చే విధంగా స్కిల్ యూనివర్సిటీని విస్తరించనున్నట్లు సీఎం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version