తెలంగాణ కేబినెట్‌ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..!

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన  నూతన సచివాలయంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్‌ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘కులవృత్తులను బలోపేతం చేసేందుకు లక్ష ఆర్థికసాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న గ్రామాలకు ఎలాంటి విధి విధానాలు అమల్లో ఉంటాయో, వారికి కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి. కాళేశ్వరం జలాలతో హిమాయత్‌సాగర్‌, గండిపేట అనుసంధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. హుస్సేన్‌ సాగర్‌తో గోదావరి జలాలను అనుసంధించాలని నిర్ణయించింది.”

“రాష్ట్ర వ్యాప్తంగా 38 డీఎంహెచ్‌ఓ పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 40మండలాలకు పీహెచ్‌సీలను మంజూరు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో శాశ్వత ఉద్యోగుల నియామకానికి కూడా కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.  వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించి, వివిధ విభాగాల్లో వారిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version