తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక రేవంత్ రెడ్డి మొదటిసారి ట్విట్టర్ వేదికదా స్పందించారు. తనను సీఎంగా ఎన్నుకున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీకి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్యం రావు థాక్రెలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. ఇటీవల వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు మ్యాజిక్ ఫిగర్ కి మించి స్థానాలను కట్టబెట్టారు.
అనంతరం సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో అధిష్టానం కాంగ్రెస్ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ప్రకటించింది. ఈనెల 7 న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రకటనకు కొద్ది నిమిషాల ముందే రేవంత్ చేసిన ట్వీట్ సంచలనం రేపింది. తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాన్ ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరి ధాన్యంతడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.