కేంద్ర పెద్దలను కలిసేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీకి వెళ్లారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ప్రధానితో చర్చించనున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వత హోం శాఖ మంత్రి అమిత్ షాతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తీరుపై పెద్ద ఎత్తున్న నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో గవర్నర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల కూడా రాజ్ భవన్ తో ప్రభుత్వం అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గవర్నర్ పర్యటనలో కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా… సమావేశాలను ప్రారంభించారు. గవర్నర్ పర్యటనల్లో మంత్రలు దూరంగా ఉంటున్నారు. దీంతో గవర్నర్, ప్రభుత్వాన్ని మధ్య గ్యాప్ పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గవర్నర్ తమిళిసై కూడా పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేస్తున్నాను. నేను ఎవరికి తలవంచబోనని ఇటీవల గవర్నర్ వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా పలు సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈనేపథ్యంలో ప్రధాని మోదీతో చర్చించే సమయంలో ఇవన్నీ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.