జాతీయ రాజకీయాల గురించి, ప్రధాని పదవి గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ కలలు కంటున్నారని విమర్శించారు బీజేపీ తెలంగాణ వ్యవహారాాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్. తెలంగాణను పట్టించుకోవడం లేదని.. గత ఎనిమిదేళ్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ లకు బీజేపీ భయపడేది లేదని అన్నారు. కొందరు నిద్రలో కలలు కంటే సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కలలు నెరవేరవు.. ఇన్ని రోజుల ఇచ్చిన హామీలను నెరవేర్చనే లేదని.. కొత్త హామీలతో ప్రజల ముందుకు కేసీఆర్ ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ముందు సీఎంగా నీ బాధ్యతలు నెరవేర్చని తరువాత ప్రధాని కావాాలి కలలు కను అని అన్నారు. తెలంగాణ ప్రజలకు భయపడి కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. దేశ వ్యాప్తంగా తనను ప్రధాని చేయాలంటూ మమత, దేవేగౌడ, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ ను కలిశారని.. కానీ ఎవరూ మద్దతు పలకలేదని అన్నారు. తెలంగాణలో ఇళ్లు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూం ఇళ్లు లేవు, దళిత బంధు ఇవ్వలేదని.. మేము చర్చకు సిద్ధం.. కేసీఆర్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు బీజేపీ కోరుకుంటున్నారని.. వచ్చేది మా ప్రభుత్వమే అని తరుణ్ చుగ్ అన్నారు.
రాష్ట్రాన్ని వదిలిపెట్టేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ : తరుణ్ చుగ్
-