తెలంగాణ ఆర్టీసీ మరోసారి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీని తీర్చిదిద్దుతున్నారు. ఇటీవల టికెట్ల చిల్లర సమస్యలను తప్పించేందుకు టికెట్ ఛార్జీలను రౌండప్ చేశారు. కొన్ని చోట్ల టికెట్ ధరలను తగ్గించి మరికొన్ని చోట్ల టికెట్ ధరలను పెంచింది.
ఇదిలా ఉంటే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ. దీంతో ప్రయాణికులపై మరింతగా భారం పడనుంది. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.5-10 వరకు అదనంగా సెస్ వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. నిన్నటి నుంచే ఈ ఛార్జీలు అమలులోకి వచ్చాయి. మరోవైపు రెండు నెలల్లో సుమారు 4250 బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశ పెట్టనున్నారు. ఇది అమలులోకి వస్తే టికెట్ పై రూ. 1-5 వరకు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులపై మరింత భారం పడనుంది.