టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. రూ.10 కాయిన్స్ తీసుకోవాలని ఆదేశం

-

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో రూ.10 కాయిన్ తీసుకోవాలని ఆదేశించింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో రూ.10 కాయిన్స్ కనిపించడం లేదు.ఒక్క ఆర్టీసీలోనే కాకుండా బయట ఎక్కడా వాటిని నగదు లావాదేవీలోకి తీసుకోవడం లేదు. ఆర్బీఐ మాత్రం ఆ కాయిన్స్‌ను బ్యాన్ చేయలేదని చెల్లుబాటులోనే ఉన్నాయని చెబుతూ వస్తోంది. కానీ, దుకాణాదారులు, ఆర్టీసీ బస్సులు, ఇతర స్టోర్లలో వాటిని అంగీకరించడం లేదు.

ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణ సమయాల్లో టికెట్ల కోసం ప్రయాణికులు ఇస్తున్న రూ.10 నాణాలను తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. పది కాయిన్స్ తీసుకునేలా అన్ని డిపోల మేనేజర్లు డ్రైవర్లు, కండక్టర్లను ప్రోత్సహించాలని టీజీఎస్ఆర్టీసీ ఆదేశాలు జారీచేసింది. ఇక మీదట ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version