జమిలీ ఎన్నికలపై తలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు పెట్టాలని కేంద్రం ఆలోచిస్తుందని.. ఎలక్షన్ కమీషన్ కు రిక్వెస్ట్ చేస్తున్నామని వెల్లడించారు. మీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపండని కోరారు.
ప్రత్యేకంగా పార్లమెంట్ పెట్టేది జమిలీ ఎన్నికల బిల్ కోసమే అనుకుంటున్నామని.. మాకు అనుమానం వస్తుందని తెలిపారు తలసాని శ్రీనివాస్. రేపు షెడ్యూల్ ఇచ్చి.. పదిహేను రోజుల్లో ఎన్నికలు అయినా మేము సిద్ధంగా ఉన్నామని… ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఓడిపోతాం అని బీజేపీ భయపడుతుందని చురకలు అంటించారు తలసాని శ్రీనివాస్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా… బీఆర్‌ఎస్ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తలసాని శ్రీనివాస్.