పొన్నాల లక్ష్మయ్య అందుకే ఆందోళన వ్యక్తం చేశారు – VH

సోనియాగాంధీ అన్ని పార్టీల ఎన్నికల లాగా పార్టీ ఎన్నికలు జరుపుతున్నారని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. రాహుల్ గాంధీ ని ఎన్నికలకు సిద్ధం చేయడానికి చాలా ప్రయత్నం చేశారని.. ఇది కుటుంబ పార్టీ అని బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ఆరోపణలు చేయడంతో ఆయన అధ్యక్ష పదవి నుండి దూరంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు అధ్యక్ష పదవి రేసులో ఖర్గే ,శశిథరూర్ లు ఉన్నారని అన్నారు.

వీ.హనుమంతరావు
వీ.హనుమంతరావు

దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య వాళ్ళ జిల్లాలలో మెంబర్షిప్ కల్పించిన వారికి సరైన స్థానం రాలేదన్నారు. కొత్తగా డెలిగేట్స్ గా పేర్లు వచ్చాయని.. పార్టీ కోసం కష్టపడ్డ వారు కాకుండా కొత్త పేర్లు వచ్చాయన్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదన్నారు హనుమంతరావు. కొత్త వారికి అవకాశం ఇచ్చారనే బాధతో పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ లు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. ఎవరికైతే జిల్లాల్లో అన్యాయం జరిగిందో వాళ్ళకి కో అప్షన్ లో అవకాశం ఇవ్వాలన్నారు.