చక్రం తిప్పిన సబితా ఇంద్రారెడ్డి

-

సబితా ఇంద్రారెడ్డి చక్రం తిప్పారు. దీంతో మీర్ పెట్ మున్సిపల్ అవిశ్వాస తీర్మానం నెగ్గింది బీఆర్ఎస్ పార్టీ. మీర్ పెట్ మున్సిపల్ కార్పోరేషన్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానాన్ని నెగ్గి పదవి కైవసం చేసుకున్నారు డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పై కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.

31 మందితో బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసానికి నోటీస్ కలెక్టర్ కు జారీ చేశారు. కలెక్టర్ అన్ని పరిశీలించి ఈరోజు అవిశ్వాసానికి సమయం ఇచ్చారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 46 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో 21 మంది బీజేపీ కార్పొరేటర్లు. 11 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. అవిశ్వాసం నెగ్గడానికి 31 మంది కార్పొరేటర్లు ఉండాలి.

అవిశ్వాసానికి మొత్తం కాంగ్రెస్ ఏడు, బీజేపీ 19 మంది హాజరయ్యారు. మొత్తం 26 మంది మాత్రమే అవిశ్వాసానికి హాజరయ్యారు. కోరంలేని కారణంగా ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కుట్రలకు తెర పడింది. మేయర్ పై అవిశ్వాసం పెట్టి భంగపడ్డ బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లకు.. మరోసారి డిప్యూటీ మేయర్ అవిశ్వాసంలోనూ భంగపాటు తప్పలేదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version