బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని హైకోర్టులో ప్రభుత్వం ఆప్పీల్

-

తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు గురువారం హైకోర్టు అనుమతి ఇచ్చింది. బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసులను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. పోలీసులు ఇచ్చిన నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. అయితే నేడు ( శుక్రవారం) బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ దాఖలు చేసింది.

ఆప్పీల్ పై అత్యవసర విచారణ చేపట్టాలని సిజె ధర్మాసనాన్ని కోరింది. పాదయాత్ర సాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతూ ఉందని ప్రభుత్వం తెలిపింది. మధ్యాహ్నం 1:15 నిమిషాలకు విచారణకు సీజే జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ధర్మాసనం అంగీకరించింది. బండి సంజయ్ జనగామ జిల్లాలో చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తూ ఉండడంతో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news