ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా జూన్ 02, 2014న విభజన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విభజన అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎస్ ల కమిటీ భేటీ అయ్యారు. తాజాగా ఈ భేటీ ముగిసింది. ముఖ్యంగా 3 అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. డ్రగ్స్ నివారణకు పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇరు రాష్ట్రాల మధ్య రూ.861 కోట్ల మేరకు లేబర్ సెస్ పంపీణికీ అంగీకరించారు. విద్యుత్ బకాయిలతో పాటు 9, 10 షెడ్యూల్ లోని సంస్థల ఆస్తులు, అప్పులపై పంచాయతీ తేలలేదు. ముఖ్యంగా అప్పులపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. ఎక్సైజ్ శాఖ అదనంగా ఇచ్చిన రూ.81 కోట్లను వెనక్కి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ వెనక్కి ఇవ్వడానికి అంగీకరించింది. ఉద్యోగాల విభజన పై చాలా సేపు చర్చ జరిగినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరో సారి భేటీ కావాలని కమిటీ నిర్ణయించింది.