Telangana: పిన్ని నోటిదూలకు.. రైలు కిందపడి నవ దంపతులు సూసైడ్‌!

-

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మా చావుకు పిన్నే కారణమని సెల్ఫీ వీడియో చేసి దంపతులు సూసైడ్ చేసుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామం వద్ద రైలు కిందపడి బలవత్ మరణానికి పాల్పడ్డారు నవ దంపతులు. మృతులు పోతంగల్ మండలం హెడ్డోలి గ్రామానికి చెందిన బండారి అనిల్ కుమార్ శైలజ గుర్తించారు పోలీసులు.

The newly married couple committed suicide after being hit by a train

వీరికి గత సంవత్సరం క్రితమే వివాహం జరిగినట్లు సమాచారం అందుతోంది. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు రైల్వే పోలీసులు. అయితే… మా చావుకు పిన్నే కారణమని సెల్ఫీ వీడియో చేసి దంపతులు సూసైడ్ చేసుకున్నారని తాజాగా తేలింది. తన పిన్ని చేసిన దుష్ప్రచారాల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో తెలిపారు. దీంతో పోలీసులు వారి కోసం గాలించగా పకీరాబాద్-మిట్టాపూర్ రైలు పట్టాలపై వారి మృతదేహాలు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version