ఇటీవల అంబర్ పేట్ లో కుక్కల దాడిలో గాయపడి చనిపోయిన బాలుడి తల్లిదండ్రులను పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ బాలుడి తల్లిదండ్రులకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. అలాగే అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి సైతం లక్ష రూపాయల చెక్కుని అందించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కుక్కల దాడిలో బాలుడి మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు.
బాలుడి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వేలాది కుక్కలను ఎక్కడి నుంచో తీసుకువచ్చి అధికారులు ఈ ప్రాంతంలో విడిచి పెడుతున్నారని విమర్శించారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి నగరానికి దూరంగా వదిలేయాలని సూచించారు. బాలుడి మృతికి జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం కూడా ఒక కారణం అన్న కిషన్ రెడ్డి.. అంబర్ పేట లో కుక్కలకు ఆపరేషన్ చేసి వదిలేయడం కారణంగా వాటి సంఖ్య పెరిగిందన్నారు.