ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ఓటు కు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కులగణన పై మాట్లాడిన సందర్భంలో కులగణన సర్వేలో పాల్గొనకుంటే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను బహిష్కరించండి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కౌశిక్ రెడ్డి తాజాగా స్పందించారు. తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ బహిష్కరణ అంటావా..?అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి సిగ్గు, శరం, మానం ఉందా..? అని ప్రశ్నించారు. కిందపడిన పెద్ద మనిషిని ఇష్టానుసారంగా మాట్లాడుతారు.   తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ అన్నారు.

పిల్లనిచ్చిన మామ గారు కట్టె పట్టుకొని నడుస్తాడు కదా అన్నారు. దొంగ అని తెలిసి పిల్లని ఇవ్వకుంటే దొంగతనం పిల్లనెత్తుకొని పెళ్లి చేసుకుండని సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక బహిష్కరణను రేవంత్ రెడ్డిని చేయాలని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో మనకు సంబంధించిన ప్రతిదీ రాసి ఉంటాం. రేవంత్ రెడ్డికి కామన్ సెన్స్ లేదు. కులగణన సర్వే తప్పుల తడక అన్నారు. రేవంత్ రెడ్డి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ లపై మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version