బీజేపీ పార్టీలో ఓబీసీ మోర్చా ఉంటది.. కేంద్రంలో ఓబీసీ శాఖ ఎందుకు ఉండదు – KTR

-

బిజెపి ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. బిజెపి పార్టీలో ఓబీసీ మోర్చా ఉంటుంది కానీ.. కేంద్రంలో ఓబీసీ శాఖ ఎందుకు ఉండదని ప్రశ్నించారు. ఇదేనా బీసీల మీద బిజెపికి ఉన్న ప్రేమ? అని ఫైర్ అయ్యారు. కేంద్రంలో ఇప్పటికీ బలహీన వర్గాల శాఖ పెట్టలేదని.. ముందు ఆ శాఖ పెట్టాలని డిమాండ్ చేశారు.

రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు మంత్రి కేటీఆర్. బిజెపి నేతలు ఇక్కడ తియ్యటి మాటలు చెప్తూ.. అక్కడ అడ్డమైన పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కడు ధనవంతుడు అయితే దేశం బాగుపడుతుందా? ఒక్కడికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇస్తే నియోజకవర్గ ప్రజలకు ఇవ్వరా? అని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రంలో కల్లుగీతను బ్యాన్ చేస్తూ బిజెపి ప్రభుత్వం జీవో విడుదల చేసిందని.. కర్ణాటకలో కల్లుగీతను పునరుద్ధరించాలని అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు, ఆలోచన చాలా పెద్దదని.. దళితులతో మొదలుపెట్టిన ఈ కార్యం భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి మేలు చేస్తారని తెలిపారు. దేశం కోసం బిజెపి ఒక్క మంచి పని కూడా చేయలేదని.. అన్ని గబ్బు పనులే చేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news