టిఆర్ఎస్ పాలనలో తండాలు ఆగం అయ్యాయని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాను లంబాడి బాషా కూడా మాట్లాడుతానన్నారు. నా నియోజకవర్గంలో లంబాడి, గిరిజన సంక్షేమం కోసం బాగా పనిచేశానని తెలిపారు ఉత్తమ్. ప్రతి తండా, గూడెం కు సీసీ రోడ్లు వేశానని అన్నారు. టీఆరెస్ పాలనలో ఒక్క గిరిజనుడికైనా పట్టా వచ్చిందా? అని ప్రశ్నించారు. పోడు భూములను సర్కార్ లాక్కుంటుందన్ ఆరోపించారు. పోడు భూములు సాగు చేసుకున్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు.
మునుగోడు లో కూడా ప్రజల్లో అవగాహన కోసం సదస్సు పెడితే నేను వస్తానని అన్నారు. కొత్త గ్రామ పంచాయితీలకు బిల్డింగ్ లు కూడా లేవని.. చెట్లకిందనే పాలన నడుస్తుందన్నారు. గిరిజన గ్రామాలకు నిధులు, నీళ్లు కల్పించడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. బంజారాహిల్స్ లో బంజార భవన్ కట్టిండు మంచిదే కానీ.. గ్రామాల్లో పరిస్థితి ఎట్లా? అని ప్రశ్నించారు. గిరిజనులు ఐక్యంగా పోరాటం చేయాలని.. మోడీ, కేసీఆర్ ను నిలదీయడానికి నేనున్నానని భరోసా ఇచ్చారు.