రాజగోపాల్ రెడ్డి ని కురుమ గొల్లోళ్లు తరిమికొట్టే రోజు తెచ్చుకోవద్దు – టిఆర్ఎస్ ఎమ్మెల్సీ మల్లేశం

-

మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం. ధర్నాల పేరుతో రాజగోపాల్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడని.. బిజెపి కార్యకర్తలతో ధర్నా చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మునుగొడులో 70శాతం మంది గొల్ల కుర్మలు నగదు ఖాతా దారులు డ్రా చేసుకున్నారని తెలిపారు. కురుమ గొల్లోళ్లను అడ్డం పెట్టుకొని రాజగోపాల్ రెడ్డి తమాషా చేస్తున్నాడని మండిపడ్డారు.

- Advertisement -

రాజగోపాల్ రెడ్డిని కురుమ గోలోళ్లు తరిమికొట్టే రోజు తెచ్చుకోవద్దని హెచ్చరించారు ఎగ్గే మల్లేశం. కురుమ గోలోళ్లు రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను చేశారని …అక్కడ ఏమైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఫ్రీగా నగదు వస్తున్నప్పుడు కురుమ గోలోళ్లు ఓపిక పట్టాలని సూచించారు. గొల్ల కురుమలకు ఆత్మగౌరవ భవనాలు రెడి అయ్యాయని …రెండు మూడు నెలల్లో ప్రారంభించుకోబోతున్నామన్నారు. గొల్ల కురుమలకు బీజేపీ ఏమి చేసిందో చెప్పాలన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజకీయం చేసుకో.. కానీ కులంలో చుచ్చిపెడితే మర్యాద దక్కదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...