దేశంలో బీసీల సంఖ్య పెరిగిందని.. బీసీల రిజర్వేషన్లు కూడా పెంచాలని డిమాండ్ చేశారు మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు. దేశానికి ఓ బీసీ ప్రధాని అయితే అందరం సంతోషపడ్డామని.. కానీ 8 ఏళ్లలో ఒక పని కూడా చేయలేదని మండిపడ్డారు. మండల కమిషన్ సిఫార్సు ముందుకు దాటడం లేదన్నారు. క్రిమిలేయర్ ఎత్తేయలని ఓబీసీ పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని.. కానీ ఇంత వరకు తీసేయలేదని అసహనం వ్యక్తం చేశారు.
అలాగే మంత్రి వర్గంలో ఓబీసీ శాఖ పెట్టాలని చెప్పామన్నారు. జనగణన లో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓబీసీ లో వందల కులాలు ఉన్నాయన్నారు. పీవీ నరసింహారావు మండలి కమిషన్ ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీ పై చర్చించాలని డిమాండ్ చేశారు. మోడీ ఇప్పటి వరకు ఓబీసీ లకు ఎం చేసవో చెప్పాలి? అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ ని నిలదీయడానికి అన్ని రాజకీయ పార్టీలను ఏకంచేస్తానన్నారు వి హనుమంతరావు. అలాగే పార్టీలో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. అందరూ కలిసి పనిచేయడానికి అవసరమైతే సీనియర్ల కాళ్లు మొక్కుతానని అన్నారు.