మహిళలంటే కెసిఆర్ సర్కారుకి ఎంత గౌరవమో – విజయశాంతి ఫైర్

-

కెసిఆర్ సర్కారుపై మరోసారి మండిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. మహిళలంటే కేసీఆర్ సర్కారుకి ఎంత గౌరవమో తాజాగా మీడియాలో వచ్చిన కథనం చూస్తే బాగా అర్ధమవుతుందన్నారు. ఆర్టీఐ కింద ఒక గనికి సంబంధించిన సమాచారాన్ని పై అధికారి అనుమతితోనే ఇచ్చినప్పటికీ ఆమెను ఏడేళ్లుగా వేధిస్తుండటమే గాక, రెండున్నరేళ్లుగా జీతం కూడా చెల్లించడం లేదని ఆరోపించారు.

ఈ బాధలు భరించలేక చివరికి ఆమె వీఆరెస్ అడిగినా ఇవ్వకుండా ఆమెకు నరకం చూపిస్తున్నరని మండిపడ్డారు. ఈ సమస్యపై ఆ మహిళా అధికారి విమెన్ కమిషన్‌కు నివేదించినా దిక్కులేదన్నారు. అంతర్గత విచారణలో ఈ వేధింపులు నిజమేనని నిర్ధారణ అయినా… నిర్భయ చట్టం కింద కేసు నమోదై ఈ విషయం సాక్షాత్తూ సీఎం దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగకపోవడం ఘోరం అని ఫైర్ అయ్యారు.

పైగా ఆమెపైనే తప్పుడు ఆరోపణలు చేసి, విచారణకు మహిళా అధికారిని నియమిస్తామని లేఖ ఇచ్చి అందుకు విరుద్ధంగా చేశారని అన్నారు. ముఖ్యమంత్రితో పాటు సీఎస్, డీజీపీ, డీవోపీటీకి సైతం ఈ విషయం తెలిసినా మిన్నకుండటం దారుణం అన్నారు విజయశాంతి. గవర్నర్‌నే లెక్క చెయ్యని ఈ సర్కారు నుంచి ఇంతకంటే న్యాయం ఆశించడం అత్యాశే అవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news