సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై విజయశాంతి సంచలన ట్వీట్‌చేశారు. ధాన్యం కొనుగోళ్ళపై ఢిల్లీలో చేసిన డ్రామా ధర్నా తుస్సుమనగానే పరుగు పరుగున హైదరాబాద్ తిరిగొచ్చిన సీఎం కేసీఆర్… హడవుడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందంటూ రైతులకి ఏదో గొప్ప ఉపకారం చేస్తున్నట్టు బిల్డప్ ప్రకటన చేశారని ఫైర్ అయ్యారు రాములమ్మ.
సీఎం ప్రెస్ మీట్ పెట్టారంటే… సహనం కోల్పోయి విపక్షాలపై బురద జల్లడానికేనని ప్రజలందరికీ తెలుసు.పారాబాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ మాత్రమే పంపిస్తమని కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ సర్కారు… అందుకు భిన్నంగా వితండవాదం చేసి, చివరికిప్పుడు మొదటికొచ్చిందని ఆగ్రహించారు. అంటే, అంతా చేసే అవకాశం ఉండీ… కేంద్రాన్ని బద్నాం చెయ్యడానికే ఈ మాటలు అంటున్నార్నారు.
ఆ బాధ్యత మీకు లేదా? రైతు బాంధవుడని, ధనిక రాష్ట్రమని చెప్పుకుంటూ ఈ బాధ్యత నుంచి ఎందుకు తప్పించుకోవాలనుకుంటున్నరు? తన తాజా నిర్ణయంతో వచ్చే సుమారు 700 కోట్ల నష్టాన్ని అంచనా వేసేందుకు నిపుణుల కమిటీ వేస్తామంటున్నారని నిప్పులు చెరిగారు. పారా బాయిల్డ్ జపం చేస్తున్నరని గతంలో నేను పదే పదే చెప్పాను. యాసంగి వడ్లలో నూకల శాతం ఎక్కువ అవుతుందంటున్న కేసీఆర్ గారు, ఆ నష్ట భారాన్ని ఎందుకని కేంద్రంపై వెయ్యాలనుకుంటున్నారు? ఇందుకు ఆహార భద్రతను సాకుగా చెబుతున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.