అది కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నాం – బండి సంజయ్

-

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన రాజకీయాలలో మరింత పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. పీఎం మోడీ పర్యటన రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ప్రధాని తెలంగాణకి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి నేటి రాత్రికి ఢిల్లీకి పయనం కానున్నారు.

నేడు ఢిల్లీకి వెల్లనున్న సీఎం కేసీఆర్ నాలుగు రోజులపాటు అక్కడే పలువురు నేతలను కలవనున్నారని సమాచారం. ఢిల్లీ నుండి హైదరాబాద్కు రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణం కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట. అయితే కెసిఆర్ ఢిల్లీ పర్యటనపై స్పందించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రావడం రాకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

రాజకీయాలు, అభివృద్ధి వేరువేరని.. ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది అన్నారు. వామపక్ష నేతలు అభివృద్ధిని అడ్డుకోవడం తగదు అన్నారు సంజయ్. 8 ఏళ్లు కేసీఆర్ కి వ్యతిరేకించిన వామపక్షాలు ఇప్పుడెందుకు ఆయన చెప్పినట్టు వింటున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news