బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై స్పందించారు ఆ పార్టీ నేత విజయశాంతి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, ఎస్ఎస్సి పేపర్ లీక్స్ పై బండి సంజయ్ ప్రశ్నించారనే ఆయనని కేసుల్లో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు అవుతుందన్న భయంతో ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి సంజయ్ ని అరెస్టు చేశారని ఆరోపించారు విజయశాంతి. తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నారు. బిఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ముందే తెలుసన్నారు.
తమ నాయకుడిని ఎలా బయటికి తీసుకురావాలో మాకు తెలుసు అన్నారు విజయశాంతి. బండి సంజయ్ అరెస్ట్ కు సంఘీభావంగా వెళుతున్న తనని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని వెల్లడించారు. తెలంగాణలో దోచుకున్న డబ్బులను తీసుకువెళ్లే ఇతర రాష్ట్రాల విపక్ష పార్టీలను మేపుతున్నారని విమర్శించారు. కెసిఆర్ ని తాను దగ్గరగా చూసానని.. తాను, తన కుటుంబం క్షేమంగా ఉండడానికి కేసీఆర్ ఎంతకైనా తెగిస్తాడని అన్నారు.