హైదరాబాద్ ను అద్భుత నగరంగా మారుస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-

హైదరాబాద్ ను అద్భుత నగరంగా మారుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాజాగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి రూ.36వేల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంటే.. ఎంవోయూల కోసం అక్కడి వరకు వెళ్లాలా..? అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.

 

కంపెనీలతో ఎంవోయూలు చేసుకుని వస్తేనే పెట్టుబడులు వస్తాయని.. అలా కాకుండా మీకు మాదిరిగా ఎక్కడో కోటలో, గడిలో కూర్చుని మాట్లాడితే పెట్టుబడులు వచ్చేవి రాష్ట్రానికి కాదని మీకు మాత్రమే వస్తాయని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ లో మీరు ఆక్రమించిన చెరువులు, కుంటలను భూములను తొలగించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశామని, హైడ్రాతో చెరువులు, పార్కుల ఆక్రమణలు తొలగించి ఈ నగర ప్రజలకు కానుకగా ఇవ్వబోతున్నామన్నారు. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధరణిపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించామని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version