సింగరేణి కార్మికుల సొంతింటి కల నిజం చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

-

సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం RG3 ఏరియా పరిధిలోని OCP 2 బొగ్గు ఉపరితల గని గేట్ మీటింగ్ లో మంత్రి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల ఇన్ కమ్ ట్యాక్స్ స్లాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గడ్డం వంశీ కృష్ణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

అనంతరం రామఖిల్లా సమీపంలో ఉపాధిహామీ కూలీలతో సమావేశం అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికల కోడ్ రాకముందే ప్రతిపాదనలు పంపామని శ్రీధర్ బాబు తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీ పని దినాలతో పాటు వేతనాలను కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు మంత్రి శ్రీధర్ బాబు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version