పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: మంత్రి కేటీఆర్

-

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ కేసులో నిందితుడిగా ఉన్న మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారించేందుకు జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతి కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ధ్రువీకరించారు. అయితే పోలీసుల విజ్ఞప్తిని బోర్డు అనుమతి ఇస్తుందా?లేదా? అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది.

 

బోర్డు కనుక నిందితులైన మైనర్లను విచారించేందుకు అనుమతి ఇస్తే.. ఈ కేసులో రహస్యంగా మిగిలిపోయిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మైనర్ల మానసిక స్థితి, నేర స్వభావం, నేరం చేయగలిగే సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని జువైనల్ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. మీరు అత్యాచారం వంటి ఘోరమైన నేరానికి పాల్పడేంత పెద్దవారయ్యారు కాబట్టి పెద్ద వాడిగానే శిక్షించాలి.. మైనర్ లా కాదు. అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news