తెలంగాణ ప్రజలకు అలర్ట్..నేడు, రేపు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గురువారం ఉరుములు, మెరుపులతో వర్షం కురువ వచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

గాలులు నైరుతి దిశ నుంచి తెలంగాణవైపు వీస్తున్నాయని… పలు జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సిద్దిపేట జిల్లాలో ఎన్ని సముద్రాలు అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం అలాగే సంగారెడ్డిలోని సాత్ వార్ లో నాలుగు సెంటీమీటర్లు, జనగామ లోని తాటి కొండ లో 3 సెంటీమీటర్లు, కామారెడ్డిలో రెండు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. ఇక ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణ లోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.