రేవంతన్న భలే లాజిక్ చెప్పావుగా!  

-

టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భలే లాజిక్ చెప్పారు..ఈ లాజిక్ గురించి ఎవరైనా ఆలోచించారో లేదో తెలియదు గాని..రేవంత్ మాత్రం బాగా చెప్పారు…అసలు రేవంత్ చెప్పిన లాజిక్ ఏంటి? దాని సంగతి ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకునే ముందు…ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి..తెలంగాణ సీఎం కేసీఆర్…అప్పుడప్పుడు తన ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు…ఢిల్లీలో, హైదరాబాద్ లోని హాస్పిటల్స్ లో ఎప్పటికప్పుడు..ఆరోగ్యం గురించి టెస్టులు చేయిస్తూ ఉంటారు.

కానీ ఎప్పుడు కూడా ఆయన టెస్టుల గురించి వార్తల్లో చూడటమే తప్ప..ఎప్పుడు కూడా హాస్పిటల్స్ లో కేసీఆర్ టెస్టులు చేయించుకునే వీడియోలు గాని, ఫోటోలు గాని బయటకు రాలేదు. అదేంటో గాని తాజాగా కేసీఆర్ హైదరాబాద్ లోని హాస్పిటల్ లో టెస్టులు చేయించుకున్నారు…కానీ కేసీఆర్ టెస్టులకు సంబంధించిన వీడియో, ఫోటోలు బయటకు వచ్చాయి..ఆయన బెడ్ మీద పడుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

ఇప్పుడే ఇదే లాజిక్ ని రేవంత్ బయటకు తీసుకొచ్చారు. సీఎం ఆస్పత్రికి వెళ్తే గతంలో ఎన్నడూ ఫొటోలు, వీడియోలు బయటకు రాలేదని, సీఎం ఆరోగ్యం బాగోలేకపోవచ్చు కానీ, ఆయన దవాఖానాలో పడుకున్న ఫొటోలు ప్రచారం చేయడం ఏమిటి? అని రేవంత్ ప్రశ్నించారు. అయితే ఇదంతా ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యాకే జరుగుతున్నాయని రేవంత్ చెబుతున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ సూచనలతో కేసీఆర్‌ సానుభూతి కోసం కొత్త నాటకాలు మొదలు పెట్టారని, కేసీఆర్‌ నిర్వహిస్తున్న సభలు, ప్రశాంత్‌ కిశోర్‌ డ్రామాలను ప్రజలందరూ గుర్తించారని ప్రశాంత్‌ కిశోర్‌ సూచనలతో కేసీఆర్‌ సానుభూతి కోసం కొత్త నాటకాలు మొదలు పెట్టారని, కేసీఆర్‌ నిర్వహిస్తున్న సభలు, ప్రశాంత్‌ కిశోర్‌ డ్రామాలను ప్రజలందరూ గుర్తించారని చెబుతున్నారు.

వాస్తవానికి చూస్తే రేవంత్ చెప్పిన లాజిక్ కాస్త కరెక్ట్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది…ఇంతకాలం కేసీఆర్ హాస్పిటల్ కు వెళ్ళిన ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు…కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాయో కాస్త డౌట్ గానే ఉందని చెప్పొచ్చు. గతంలో ఏపీలో జగన్ కోడి కత్తి ఘటన, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాలుకు కట్టుకున్న ఘటనలని నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. మరి చూడాలి ఇవన్నీ సింపతీ పాలిటిక్స్ అనుకుంటా!

Read more RELATED
Recommended to you

Latest news