రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఒక్కొక్క కోనుగోలు కేంద్రాల దగ్గర నోడల్ ఆఫీసర్, మిల్లులు దగ్గర ఒక ఆఫీసర్ ఉంటారని, తెలంగాణ లో 36 లక్షలు ఎకరాలు లో సాగు జరిగిందని,65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నాము అన్నారు మంత్రి గంగుల కమలాకర్.పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కోసం15 కోట్ల గన్ని బ్యాగ్ లు అవసరం అవుతాయి.మన దగ్గర కోటి 60 లక్షల గన్ని బ్యాగులు అవసరం అవుతాయని అన్నారు.
జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా కి గన్ని బ్యాగులు కోసం అడిగామని అవి ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర కొనడానికి లేదు.ఏడూ కోట్ల 50 లక్షలు కొత్త గన్ని బ్యాగులు కావాలి, 527 కోట్లు డీ డీ ఇవ్వాలి అని అన్నారు.ఫుడ్ కార్పోరేషన్ ఇండియా దగ్గరే ఎక్కువ గొడౌన్ లు ఉన్నాయని అన్నారు.రూ.1960 కంటే ఒక్క రూపాయి తక్కువకు ఎవరు ధాన్యాన్ని అమ్ముకోవద్దు అని రైతులకు సూచించారు మంత్రి గంగుల కమలాకర్.