డాక్టర్ ప్రీతి ఆత్మహత్యపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బిజెపి సీనియర్ నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పుట్టినరోజు పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగులూరు సమీపంలోని కళ్లెం జంగారెడ్డి గార్డెన్స్ లో జరిగిన జన్మదిన వేడుకలకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మెడికో ప్రీతి నాయక్ ఆత్మహత్య, అంబర్పేట్ లో కుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన, ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న స్పందించని మూర్ఖుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరి బతుకులు మారలేదని విమర్శించారు. ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని చెప్పారు. రాష్ట్రంలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని అన్నారు. రేపిస్టులు అంతా బిఆర్ఎస్, ఎంఐఎం వారే ఉన్నారని ఆరోపించారు.