సీఎం కేసీఆర్ ను జైలులో పెడతామని అమిత్ షా పదేపదే చెప్పి మా చెవులు చిల్లులు పడ్డాయని.. కెసిఆర్ ను ఎందుకు జైల్లో పెట్టడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూూ.. రాష్ట్రంలో పేరుకే ఎస్సీ, ఎస్టి, బీసీ గురుకుల హాస్టల్స్ అని.. హాస్టల్స్ లో వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని వండిపడ్డారు. విషపు ఆహారం తిని పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హాస్టల్స్ రూములలో ఎలుకలు తిరుగుతున్నాయని అన్నారు. గవర్నర్ కూడా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూందని.. అయినా కూడా ప్రభుత్వం స్పందించదా? అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రజా దర్బారు పేరుతో ప్రజలను కలుస్తుంటే.. కేటీఆర్ మాత్రం ఎవరినీ కలవరని దుయ్యబట్టారు. కొన్ని విషయాలను బయటకు చెప్పలేకపోతున్నా అని గవర్నర్ అంటోందని.. బయటకు చెప్పకపోతే ప్రజలకు ఎలా తెలుస్తోంది అన్నారు. కెసిఆర్ అవినీతి రిపోర్టును గవర్నర్ అమిత్ షాకు ఇవ్వచ్చు కదా? అన్నారు. ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరిస్తే హాస్టల్స్ ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.