కేసీఆర్ ని ఓడించేందుకు ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటా – రాజగోపాల్ రెడ్డి

-

తెలంగాణ బిజెపిలోని అసంతృప్త నేతలు పార్టీ మారబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అసంతృప్తులను బుజ్జగించేందుకు అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా నేడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ కానుంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. తెలంగాణలో మరో ఆరు నెలలలో ఎన్నికలు ఉన్నందున దుష్ప్రచారాలతో బిజెపిని బలహీనం చేసే కుట్రలు చేస్తున్నారని అన్నారు.

పార్టీ మారుతున్నాననే ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని కోరారు కోమటిరెడ్డి. ప్రస్తుతం బిజెపి లోనే ఉన్నానని తెలిపారు. కేసీఆర్ ని ఓడించడమే తమ లక్ష్యం అని చెప్పారు. అందుకే బీజేపీలో చేరానని.. ఆ లక్ష్యసాధనకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటానని అన్నారు. ఇక అమిత్ షా తో జరిగే సమావేశంలో తెలంగాణ రాజకీయ పరిస్థితులను వివరిస్తానని చెప్పారు. మోడీ అమిత్ షా తలుచుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version