BRS అంటే… బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ – వైఎస్ షర్మిల

BRS అంటే… బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీతో పోల్చుకోడానికి సిగ్గుగా లేదా KCR ? అంటూ ఓ రేంజ్‌ లో వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు.


ప్రజలు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చింది కానీ నీ దొంగ దీక్షకు కాదు. రాష్ట్ర సొమ్మును పదికొక్కుల్లా తిని, ఇప్పుడు దేశాన్ని లూటీ చేయడానికి విమానాలు కొంటున్నారని నిప్పులు చెరిగారు. మహాత్మాగాంధీ పేరు ఉచ్చరించే అర్హత కూడా KCRకు లేదని విమర్శలు చేశారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, నిస్సాహాయ స్థితిలో ఉన్నవారిని కూడా ఆదుకోని ముఖ్యమంత్రి ఎందుకు? తలదించుకుని రాజీనామా చెయ్ KCR అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు వైఎస్‌ షర్మిల. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో, రెండు రేకులేసుకుని, బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్న ఈ అవ్వలకు ఇండ్లు, పింఛన్లు ఇవ్వలేని ప్రభుత్వం ఉండి ఎందుకు? అని నిలదీశారు.