తాలిబన్ల రాజ్యంలా కల్వకుంట్ల రాజ్యం నడుస్తోంది – వైయస్ షర్మిల

తెలంగాణ సిఎం కేసీఆర్ ప మరో సారి విరుచుకువద్దరు వైఎస్ షర్మిల. వైరా రిజర్వాయర్ ను రూ.50 కోట్లతో వైయస్ఆర్ మరమ్మతులు చేయించి, 25వేల ఎకరాలకు సాగు నీరందించారని మండిపడ్డారు. కేసీఆర్ మాత్రం ఎనిమిదేండ్లలో ఒక్క రూపాయి కేటాయించలేదు. స్థానిక ఎమ్మెల్యే వైయస్ఆర్ పేరుతో ఇండిపెండెంట్​గా గెలిచి, అంగడిలో పశువులా కేసీఆర్ కు అమ్ముడుపోయాడని అగ్రహించారు.

బెల్టు షాపులు, భూకబ్జాలను ప్రోత్సహిస్తూ KCRలా తయారయ్యాడని… రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. మంచినీళ్లు దొరకవు కానీ మద్యం మాత్రం దొరుకుతోంది.తాలిబన్ల రాజ్యంలా కల్వకుంట్ల పాలన నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు KCR దిక్కుమాలిన పాలనను పాతరేసి, YSR సంక్షేమ పాలనకు పట్టం కట్టాలని పేర్కొన్నారు. మహానేత వైయస్ఆర్ కు మరణం లేదు. ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. ఐదేండ్లలోనే అనేక సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేసిన ఘనత వైయస్ఆర్ గారిది. మాట తప్పని, మడమ తిప్పని వైయస్ఆర్ బిడ్డగా మాటిస్తున్నా తెలంగాణలో YSR సంక్షేమ పాలను తిరిగి తీసుకొస్తానని శపథం చేశారు.