బండి సంజయ్ ఓ దద్దమ్మ – వైయస్ షర్మిల

-

బండి సంజయ్ ఓ దద్దమ్మ  అని  వైయస్ షర్మిల ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ‘మాటల’ ఎంపీ. 2కోట్ల ఉద్యోగాలు, విభజన హామీలపై ఏనాడూ కేంద్రాన్ని నిలదీయలేని దద్దమ్మ. మతం పేరుతో చిచ్చుపెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే ఈయనకు తెలిసిన సిద్ధాంతం. బండి సంజయ్​ కి దమ్ముంటే, కమీషన్లు తీసుకోకుంటే కేంద్రంతో మాట్లాడి కాళేశ్వరం అవినీతిపై ఎంక్వైరీ చేయించాలి అని పేర్కొన్నారు షర్మిల.

మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజలకు కనిపించడు. ప్రజా సమస్యలు పట్టించుకోడు. ఎవరైనా ప్రశ్నిస్తే బూతుపురాణం. నమ్మి ఓట్లు వేస్తే రౌడీలా మారిండట. ఒకప్పుడు ఏమీ లేని ఈ ఎమ్మెల్యే వందల కోట్లు సంపాదించి, కేసీఆర్ లాగే ఫామ్ హౌజ్ లు కూడా కట్టుకున్నాడట అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news