సీనియర్ హీరోల ఎనర్జీ సూపర్ గా ఉందే..!!

-

టాలీవుడ్లో  ఇప్పుడు ఎక్కువ శాతం సీనియర్ హీరోలు , చిన్న హీరోలు హంగామాగా వుంది. మహేష్, ఎన్టీఆర్ ,చరణ్ ,బన్నీ లాంటి స్టార్ హీరోల సినిమాలు వచ్చే ఏడాది వరకు థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదు. అలాగే నాని నితిన్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ శర్వానంద్ వంటి మీడియం రేంజ్ హీరోల సినిమాల విడుదల కూడా  ఇప్పట్లో లేదు. దీనితో సీనియర్ హీరోలు అందరూ బాక్స్ ఆఫీస్ యుద్దం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఇద్దరూ దసరాకి తమ సినిమాలతో వచ్చి సందడి చేశారు. చిరు యొక్క గాడ్ ఫాదర్ మంచి విజయాన్ని అందుకుంది.కాని నాగ్ ఘోస్ట్ మాత్రం బోల్తా కొట్టింది.

పెద్ద హీరోలలో ప్రభాస్ `ఆదిపురుష్`జనవరిలో రిలీజ్ కు సిద్దంగా వుంది. మిగిలిన హీరోలు కూడా తమ సినిమాల కోసం కొత్త కొత్త కంటెంట్ తో రావాలని ప్రయత్నం చేస్తున్నారు..యంగ్ హీరోల్లో చాలా మంది ఇప్పటికే తమ తమ సినిమాలతో థియేటర్లలోకి వచ్చేశారు. కొంత మంది హిట్ లని దక్కించుకోగా మరి కొంత మంది పరాజయం చెందారు. వాళ్లు ఇప్పుడు కొత్త  సినిమాలపై దృష్టిపెట్టారు. అవి థియేటర్లలోకి రావాలంటే కనీసం ఆరు నెలలైనా పడుతుంది. ఒక్కొ యంగ్ హీరో రెండు మూడు సినిమాలతో బిజీగా వున్నాడు.

చిరంజీవి బాబీతో చేస్తున్న `వాల్తేరు వీరయ్య` జనవరి సంక్రాంతి బరికి రెడీ అవుతోంది. అలాగే వెంకటేష్ సినిమా కూడా సంక్రాంతి కంటే ముందే వచ్చే ఛాన్స్ వుంది. బాలకృష్ణ కూడా తన 107వ సినిమా తో డిసెంబర్ లో లేదా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ సంక్రాంతికి పందెం కోళ్ల లా తలపడ బోతున్నారు. ఫిబ్రవరి నెలలో విజయ్ దేవరకొండ కుషి వచ్చే అవకాశం ఉంది.అలాగే హరి హర వీర మల్లు, దసరా మార్చి నెలలో విడుదల అయ్యే ఛాన్స్ వుంది. తర్వాత చిరంజీవి భోళా శంకర్ వస్తుంది.చూస్తుంటే సీనియర్ హీరోలే మంచి ఎనర్జీ తో వున్నారని పిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news