ట్రెండ్ ఇన్: లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో మరోసారి విజయ్..ఈ సారి ‘మాస్టర్’‌ను మించి..

-

కోలీవుడ్ యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్..ప్రజెంట్ కమల్ హాసన్ ‘విక్రమ్’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. లోకేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది జూన్ 3న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా, ఈ చిత్ర ప్రమోషన్స్ లో విజయ్ అభిమానులకు శుభవార్త చెప్పారు డైరెక్టర్ లోకేశ్.

తలపతి విజయ్ తో తాను మరో చిత్రం చేయబోతున్నట్లు లోకేశ్ కనకరాజ్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. దాంతో తలపతి విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. ఈ సారి రాబోయే ఫిల్మ్ ‘మాస్టర్’ ను మించి ఉండాలని సూచిస్తు్న్నారు. ఈ క్రమంలోనే హ్యాష్ ట్యాగ్ తలపతి 67 #Thalapathy67తో వరుస ట్వీట్స్ చేస్తున్నారు. అలా సదరు హ్యాష్ ట్యాగ్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

‘మాస్టర్’ ఫిల్మ్ లో విలన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించారు. అయితే, ఈ పిక్చర్ కొంత భాగం క్లాస్ గా ఉండి, మరి కొంత భాగం మాస్ గా ఉంటుంది. తెలుగులోనూ ఈ సినిమా ఘన విజయం సాధించింది. అమెజాన్ ప్రైమ్ OTTలోనూ ఈ చిత్రానికి చక్కటి ఆదరణ దక్కింది. కాగా, ఈసారి లోకేశ్ కనకరాజ్ – తలపతి విజయ్ కాంబోలో రాబోయే మూవీ..‘మాస్టర్’ ను మించి ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

 

Read more RELATED
Recommended to you

Latest news