దారుణం : మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్‌

-

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. మొదట్లో వ్యాక్సిన్ కొరత ఉన్నప్పటికీ… ఆ సమస్య ప్రస్తుతం కాస్త సద్దుమణిగింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఠానే ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ఒకే రోజు మూడు డోసులు వ్యాక్సినేషన్ తీసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఠానే మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఓ మహిళకు గంటల వ్యవధిలోనే మూడు డోసులు ఇచ్చారు.

ఈ విషయం ఆమె భర్తకు చెప్పడంతో సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆమె భర్త మాట్లాడుతూ..  తన భార్య తొలిసారి వ్యాక్సిన్ వేసుకున్నందున ఆమెకు వ్యాక్సిన్ ప్రక్రియ గురించి అవగాహన లేదని తెలిపాడు. సిబ్బంది గంటల వ్యవధిలో మూడు డోసులు ఇవ్వడంతో ఆమెకు జ్వరం వచ్చినట్లు ఆయన పేర్కొన్నాడు. మరుసటి రోజు ఉదయం తగ్గిందని ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వివరించాడు. ఇక ఈ సమస్యను స్థానిక కార్పొరేటర్ వద్ద లేవనెత్తగా ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news