సొట్టబుగ్గలు ఏర్పడటం వెనుక అసలు కారణం అది.! జ్యోతిష్యం ఏం చెప్తుందంటే..

-

సొట్టబుగ్గలు, పంటిపైన పన్ను..ఇవి ఉంటే భలే లుక్‌ ఉంటుంది కదూ.. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సరే.. మస్త్‌ క్యూట్‌ ఉంటారు. నవ్వినప్పుడు బుగ్గలు సొట్టపడితే అబ్బో..ఆ అందమే వేరు. చాలామంది అరే మనకు కూడా సొట్టబుగ్గలు ఉంటే బాగుండూ అనుకుంటారు. అసలు సొట్టబుగ్గలు ఎలా వస్తాయో తెలుసా..? వీటి వెనుక పెద్ద కథే ఉంది.

సైన్సు ప్రకారం..

సొట్ట బుగ్గలు పడడం వెనుక మానవ శరీర నిర్మాణమే కారణం. ముఖంలోని ప్రధాన కండరం జైగోమాటికస్ సాధారణంగా చెంప ఎముక నుంచి మన నోటి మూల వరకు ఒకేలా ఉంటుంది. కొందరిలో పుట్టుకతోనే ఈ కండరం రెండు వేర్వేరు చిన్న కండరాలుగా విడిపోతుంది. ఇందులో ఒకటి నోటి చివర వరకు వెళుతుంది. ఇంకోటి మాత్రం నోటి మూలలో ఆగిపోతుంది. ఆ రెండు కండరాల మధ్య ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అప్పుడు నవ్వినప్పుడు అక్కడ లోతుగా సొట్ట పడుతుంది. తల్లికి లేదా తండ్రికి సొట్ట బుగ్గలు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం 50 శాతం ఉంది.

జ్యోతిష్యం ప్రకారం..

జ్యోతిష్యం ప్రకారం.. సొట్ట బుగ్గలు కలిగిన వారి జీవితం కూడా వారిలానే అందంగా ఉంటుందట.. విష్ణు పురాణం ప్రకారం సొట్ట బుగ్గలు కలిగిన మగువలకు వైవాహిక జీవితం చాలా బాగుంటుందట. సొట్ట బుగ్గలు కలిగిన మహిళలు తమ భర్త పట్ల మంచి సంబంధం కలిగి ఉంటారు. అమితమైన ప్రేమ, గౌరవం కలిగి ఉంటారు. భాగస్వామికి కావాల్సిన ప్రేమ పంచుతారు. అయితే సొట్ట బుగ్గలు ఉన్న మహిళలు అత్తగారి ప్రేమను పొందలేరు. సొట్ట బుగ్గల అమ్మాయికి అత్తగారు ఉండరు.. లేదా పెళ్లి తర్వాత కొంతకాలానికే మరణిస్తారు. శుక్రుడు వీళ్ల లైఫ్ లో బలంగా ఉండటం వల్ల.. చాలా అందమైన, ఆనందకరమైన లవ్ జీవితాన్ని పొందుతారు.

అయితే వయసు పెరిగే కొద్ది కొందరికి సొట్టబుగ్గలు మాయం అవుతాయి.. కారణం కండరాలు పెరుగుతూ ఉంటాయి.. దీనివల్ల అవి మూసుకుపోతాయి. మొత్తానికి సొట్టల వెనుక కారణం అది. ఇంతకీ మీకు సొట్ట బుగ్గలు ఉన్నాయా..?

Read more RELATED
Recommended to you

Exit mobile version