బ‌హుజ‌న వ‌ర్గాల అభ్యున్న‌తే ధ్యేయం : సీఎం కేసీఆర్‌

-

సీఎం కేసీఆర్, మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి సందర్భంగా ఈ దేశానికి ఫూలే చేసిన సేవలు, త్యాగాలను గుర్తుచేసుకున్నారు. వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా, దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జ్యోతిబా ఫూలే దాదాపు రెండు వందలం ఏండ్ల క్రితమే కార్యాచరణ చేపట్టారని సీఎం పేర్కొన్నారు. మహాత్మా ఫూలేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా తన గురువుగా ప్రకటించుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల ఆశయాలను నెరవేర్చేదిశగా తెలంగాణ ప్రభుత్వం తన ప్రాధాన్యతాక్రమాన్ని రూపొందించుకుని అభివృద్ధి సంక్షేమ కార్యాచరణను అమలు చేస్తున్నదని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

CM KCR extends greetings on World Health Day - Telangana Today

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఎక్కువ శాతం బహుజన వర్గాలు లబ్ధిదారులుగా వున్నారని సీఎం తెలిపారు. అందరితో పాటుగా దళితబంధు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక ప్రగతినిధి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి, పారిశ్రామికవేత్తలకు అండగా టీఎస్ ప్రైడ్, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గిరిజనులకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు వంటి అనేక కార్యక్రమాలను, ఎస్సీ ఎస్టీల ప్రగతి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. బీసీల వికాసానికి మహాత్యాజ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి, బీసీ గురుకులాలు, గొర్రెల పంపిణీ, బెస్త, ముదిరాజుల ఉపాధి కోసం చెరువుల్లో చేపల పెంపకం, బీసీలకు ఆత్మగౌరవ భవనాలు, గీత, చేనేత, మత్స్యకార్మికులకు ప్రమాద బీమా, కల్లు దుకాణాల పునరుద్ధరణ, గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు, నేతన్నకు చేయూత, సెలూన్లకు ఉచిత్ విద్యుత్ ద్వారా నాయీ బ్రాహ్మణులకు చేయూత, రజకులకు ఆధునిక లాండ్రీ యంత్రాలు, దోభీ ఘాట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను సంబ్బండ వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news