కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన కేవలం నటుడు మాత్రమే కాకుండా విద్యాసంస్థల అధినేతగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇక రాజకీయాలలో కూడా వైసిపి పార్టీ కి మద్దతు ఇచ్చినప్పటికీ అక్కడ ఎనుతగినంత గౌరవం లభించడం లేదని ఇటీవల బీజేపీ లోకి చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక మొత్తానికైతే అటు తన విద్యాసంస్థలను చూసుకుంటూ ఇటు సినిమాలలో కూడా అడపాదడపా బిజీ అవుతున్నారు మోహన్ బాబు. ఇదిలా ఉండగా ఇటీవల కొంతమందికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
మంచు మనోజ్ రోజులకు రోజులు బయట స్నేహితులతో సమయం గడుపుతూ.. పబ్బులు పార్టీలు అంటూ ఇంటికి కూడా రాకుండా జల్సాల బారిన పడ్డ ఈయన చూసి..మంచు మనోజ్ ను ఈ స్థితికి తీసుకొచ్చిన.. బుల్లితెర పై ప్రసారమవుతున్న అత్తారింటికి దారేది సీరియల్లో మన్మధుడిగా పేరు తెచ్చుకున్న హీరో వీరేన్ కి గట్టిగా మార్నింగ్ ఇచ్చారట. నిజానికి వీరేన్ అలాగే మంచు మనోజ్ చిన్ననాటి స్నేహితులు. ఇక వీరిద్దరితోపాటు మరికొంతమంది స్నేహితుల కలిసి ఎప్పుడు ఫుల్ పార్టీ కల్చర్ ను ఎంజాయ్ చేస్తూ ఉండేవారు.ఇక వీరి కోసం చెన్నై నుంచి స్నేహితులు రావడం.. ఇక వీరంతా రోజుల తరబడి ఇంటికి వెళ్లకుండా బయట తిరుగుతూ, తాగుతూ ఎంజాయ్ చేయడం లాంటివి చేసేవాళ్లు. ఇక ఈ విషయం మోహన్ బాబు దృష్టికి రాగా.. ఇందులో గ్యాంగ్ లీడర్ ఎవరు అని ఆరా తీయగా వీరేన్ అని తెలియడంతో సరాసరి అతడికి ఫోన్ చేసి తన కొడుకుతో ఇంకోసారి కలిసి కనిపిస్తే కాళ్లు విరగ్గొడతానంటూ వార్నింగ్ ఇచ్చాడట. ఇక ఈ విషయాన్ని వీరేన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించడంతో.. ఇది కాస్తా ప్రస్తుతం బాగా హాట్ టాపిక్ గా మారింది.