“చికెన్‌ టిక్కా మసాల” సృష్టికర్త మృతి..

-

బిర్యానీ తర్వాత రెస్టారెంట్స్‌లో బాగా తినేది.. చికెన్‌ వెరైటీస్‌, చికెన్‌ టిక్కా, చికెన్‌ 65 ఇలా.. చికెన్ టిక్కా మసాలా బ్రిటన్‌తో పాటు ఇండియాలో కూడా చాలా ఫేమస్‌ వంట.. ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో చికెన్ టిక్కా మసాలా పాపులర్ అయింది. ఇంతటి పేరు తెచ్చుకున్న చికెన్ టిక్కా మసాలాను సృష్టించిన ప్రముఖ చెఫ్ అలీ అహ్మద్ అస్లామ్ కన్నుమూశారు. 77 సంవత్సరాల వయసులో స్కాట్‍ల్యాండ్‍లో గ్లాస్గో నగరంలో ఆయన మృతి చెందారు. ఈ విషయాన్ని షిష్ మహల్ రెస్టారెంట్ వెల్లడించింది. ఆయన మృతికి సంతాపంగా 48 గంటల పాటు హోటల్‍ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అలీ అహ్మద్ అస్లామ్ ఎవరు.. ఆయన చికెన్ టిక్కా మసాలా ఎలా కనుగొన్నారో ఓసారి చూద్దామా..!!

పాక్ నుంచి స్కాట్‍ల్యాండ్‍కు

అలీ అహ్మద్ అస్లామ్.. పాకిస్తాన్‍లో పుట్టారు. చిన్నతనంలోనే స్కాట్‍ల్యాండ్‍లోని గ్లాస్గోకు వెళ్లారు. అక్కడే 1964లో షిష్ మహల్ రెస్టారెంట్‍ను స్థాపించారు. 1970ల్లో చికెన్ టిక్కా మసాలాను అహ్మద్ అస్లామ్ సృష్టించారు. కొత్త తరహా సూప్‍ను తయారు చేసి, చికెన్‍తో కొత్త ప్రయోగం చేశారు. ఆ సమయంలోనే చికెన్ టిక్కా మసాలాను కొనుగొన్నారు.

ఆలోచన అలా పుట్టింది

అసలు చికెన్ టిక్కా మసాలా తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో 2009లో ఓ ఇంటర్వ్యూ ద్వారా అలీ అస్లామ్ అహ్మద్ తెలిపారు. టిక్కా చికెన్ డ్రైగా ఉందని ఓ కస్టమర్ ఫిర్యాదు చేయటంతో తాను ఈ కొత్త డిష్ కొనుగొన్నానాడట. “చికెన్ టిక్కా మసాలాను ఈ రెస్టారెంట్‍లోనే సృష్టించాను. ఓ రోజు ఓ కస్టమర్ నా దగ్గరికి వచ్చి చికెన్ టిక్కాతో పాటు నేను సాస్ కూడా తీసుకుంటానని, అది చాలా డ్రైగా ఉంటోందని కంప్లయింట్ చేశాడు. దీంతో సాస్‍తోనే చికెన్‍ను కుక్ చేయడం బాగుంటుందని అనుకున్నాం. అప్పటి నుంచి సాస్‍తో కలిపి చికెన్ టిక్కాను వండుతున్నాం. పెరుగు, క్రీమ్, సుగంధ ద్రవ్యాలు ఆ సాస్‍లో ఉంటాయి” అని అలీ అహ్మద్ అస్లామ్ అప్పట్లో తెలిపారు. దానికి చికెన్ టిక్కా మసాలాగా పేరుపెట్టారు. అనంతరం బ్రిటన్‍ దేశాల్లోని రెస్టారెంట్లలో ఇది చాలా ఫేమస్ డిష్‍గా మారింది. ఆ తర్వాత ప్రపంచమంతా వ్యాపించింది. పాకిస్థాన్‍లోని పంజాబ్ ప్రావిన్సులో అలీ అహ్మద్ అస్లామ్ జన్మించారు. ఆ తర్వాత గ్లాస్గోకు వెళ్లారు. 1964లో షిష్ మహల్ రెస్టారెంట్ స్థాపించారు. 1970 దశకంలో ఆయన చికెన్ టిక్కా మసాలాను సృష్టించారు.

ఒక్కో డిష్‌కు ఒక్కో స్టోరీ ఉంటుంది.. తినడంతో పాటు తెలుసుకుంటే చాలా బాగుంటుంది.. మీ అందరికీ ఓ ప్రశ్న..హైదరాబాద్‌లో కృతుంగా రెస్టారెంట్‌కు వెళ్లే ఉంటారు.. ఆ పేరు వినగానే స్పైసీ ఫుడ్‌ అనేస్తాం.. అసలు కృతుంగా రెస్టారెంట్‌కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా..? ఆలోచించండి.. లాజికల్‌గా. తెలిస్తే కమెంట్‌ చేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news