The Ghost OTT : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది ఘోస్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పుటినుంచంటే?

-

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ” ది ఘోోస్ట్ ”. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్‌ ఆఫీస్‌ ముందు అట్టర్‌ ఫ్లాఫ్‌ అయింది. దసరా రోజున రిలీజ్‌ అయి.. పరాజయం పాలైంది. ఈ చిత్రంలో నాగ్‌కి జోడీగా సోనాల్ చౌహాన్ నటించింది.

కింగ్ నాగార్జున ఈ ది ఘోస్ట్‌లో యాక్షన్‌ హీరోగా కనిపించారు, ఇది విడుదలకు ముందే మంచి సంచలనాన్ని సృష్టించింది. కానీ పాపం, ఎగ్జిక్యూషన్‌లో సమస్యల కారణంగా సినిమా థియేట్రికల్ రన్‌లో బాగా ఆడలేకపోయింది. సినిమా బాగా ఆడకపోయినా యాక్షన్ సీక్వెన్స్‌లు స్టైలిష్ ప్రెజెంటేషన్‌కు ప్రశంసలు అందుకుంది. అయితే.. తాజాగా ఈ సినిమా ఓ బిగ్‌ అప్‌ డేట్‌ వచ్చింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 2న ప్రీమియర్‌ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా నెట్‌ ఫ్లిక్స్‌ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version