తెలంగాణలో ఉపాధి హామీ వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

-

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రోజు వారీ వేతనాన్ని రూ. 245 రూపాయల నుంచి రూ.257 రూపాయలకు పెంచింది.పెంచిన ఉపాధి హామీ వేతనాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.పలు గ్రామాల్లో కొనసాగుతున్న పనులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.కూలీల హాజరు, పనుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

కార్డు ఉన్న ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించాలన్నారు.ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం పూట పనులు చేయించాలని, కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.తాజాగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news