తాజ్ మహల్ ఎత్తు కుతుబ్ మినార్ కంటే ఎక్కువా? తాజ్ మహల్ గురించి మీకు తెలియని సత్యాలు 

-

మొఘల్ రాజు షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్, ప్రపంచ వింతల్లో ఒకటి. ఆ వింత గురించి చిన్నప్పటి నుండి చదువుకున్నా  కూడా కొని తెలియని నిజాలు ఉండిపోయాయి. ఆ సత్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

మీకిది తెలుసా? తాజ్ మహల్ ఎత్తు, కుతుబ్ మినార్ కంటే ఎక్కువ. ఢిల్లీ లో ఉన్న కుతుబ్ మినార్ కంటే 5అడుగుల ఎత్తులో తాజ్ మహల్ ఉంది.

ప్రస్తుత విలువ

తాజ్ మహల్ కట్టినపుడు దాని నిర్మాణానికి సుమారు 32మిలియన్ల ఇండియన్ రూపాయలు ఖర్చయ్యాయి. ప్రస్తుతం ఆ విలువ 1బిలియన్ డాలర్లు గా ఉంటుందని అంచనా.

తీసుకున్న సమయం

ఈ అద్భుత నిర్మాణాన్ని నిర్మించడానికి సుమారు 17సంవత్సరాలు పట్టింది.

కూలీలు

ఈ నిర్మాణానికి మొత్తం 22వేల మంది కూలీలు పనిచేసారు. లేబర్ పనితో పాటు కళానిపుణులు, పాలరాతి చెక్కిన శిల్పులు మొదలగు వారందరూ కలిసి 22వేలమందికి పైగా తాజ్ మహల్ నిర్మాణానికి 17ఏళ్ళ పాటు పనిచేసారు.

ఏనుగులు

సుమారు వెయ్యి ఏనుగులను ఈ నిర్మాణంలో వాడారట. రాతి నిర్మాణంలో వస్తువులను మోయడానికి ఏనుగులను వాడుకున్నారు.

తాజ్ మహల్ నిర్మాణంపై రాతలు

తాజ్ మహల్ మీద కొన్ని రాతలు కనిపిస్తాయి. అవి పవిత్ర ఖురాన్ లోని శ్లోకాలు.

నల్ల తాజ్ మహల్

పాలరాతితో తాజ్ మహల్ నిర్మాణం పూర్తయ్యాక, నల్లటి రంగులో ఉన్న మరో తాజ్ మహల్ ని నిర్మించాలని షాజహాన్ భావించాడట. కానీ దానికి తన వారసులు ఒప్పుకోలేదు.

తాజ్ మహల్ మీద రాళ్ళు

తాజ్ మహల్ మీద రకరకాల రాళ్ళు కనిపిస్తాయి. మొత్తం 28రకాల రాళ్ళు తాజ్ మహల్ నిర్మాణానికి వాడారు. ఈ రాళ్ళను శ్రీలంక, టిబెట్, చైనా ఇంకా భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి తీసుకువచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version