హీరో నానికి తృటి లో తప్పిన ప్రమాదం..!

-

ప్రముఖ నాచురల్ స్టార్ హీరో నాని తాజాగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకోవడం జరిగింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగానే తెలంగాణలోని గోదావరిఖనిలో షూట్ జరుగుతున్న నేపథ్యంలో షూటింగ్లో భాగంగా బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా బొగ్గంత అతడిపై పడినట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు నానికి ఎటువంటి గాయాలు కాలేదు అని.. కొద్దిసేపు ఈ సంఘటనతో షూటింగుకు అంతరాయం కలిగిందని సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా నాచురల్ స్టార్ నాని .. అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక నాని గురించి పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. కష్టపడి పైకి వచ్చిన నాని ప్రజల్లో ఒకడిగా ఎప్పుడు తన నటనతో వారిని అలరిస్తూ ఉంటాడు. అష్టా చమ్మా సినిమా ద్వారా హీరోగా పరిచయమైన నాని ఆ తర్వాత ఈగ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగు వెలుగుతున్న ఈయన ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరో స్థాయిని అందుకున్నాడని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ సినిమాతో నాని క్రేజ్ పెరిగిపోవడమే కాదు సోషల్ మీడియాలో కూడా ఆయనకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నానీ కు ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండడమే కాదు ఆయన కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమాలో షూటింగ్లో బిజీగా ఉన్నాడు నాని. కానీ ఇటీవల ఆ ప్రమాదం జరగడంతో తాజాగా బయటపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news