ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్ శనివారం 450 ఆక్సిజన్ కాన్సట్రేటర్లను ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్నట్టుగా చెప్పింది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇది భారీ సాయంగానే చెప్పుకోవాలి. సిఎస్‌కె డైరెక్టర్ ఆర్ శ్రీనివాసన్ ఆక్సిజన్ కాన్సట్రేటర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు అందజేశారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రూపా గురునాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మూడు సార్లు ఐపిఎల్ విజేతగా నిలిచిన చెన్నై జట్టు కోవిడ్ సహాయక చర్యల్లో పాల్గొన్న భూమికా ట్రస్ట్ అనే ఎన్జీఓతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు కొన్ని కాన్సట్రేటర్లు ఇవ్వగా త్వరలోనే మరికొన్ని ఇస్తారు. గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ పరిధిలో వీటిని ఉపయోగిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఆర్ధిక సహాయంతో పాటుగా మందులను కూడా తాము ఇస్తామని చెన్నై జట్టు పేర్కొంది.