చిరుతల సంగతి సరే.. ఉద్యోగాల సంగతేంటి? – రాహుల్ గాంధీ

-

శనివారం ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయి. కమలం కార్యకర్తలు మోడీ బర్త్ డే ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా కేంద్రం వన్యప్రాణ సంరక్షణకు తెరతీసింది. దేశంలో అంతరించిపోయిన ఎనిమిది చీతాలను నమీబియా నుంచి తీసుకొచ్చింది. దాదాపు 8 దశాబ్దాల తర్వాత చీతాలు ఇండియాలోకి అడుగుపెట్టాయి. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన చీతాలను మధ్యప్రదేశ్ లోని కూనో పార్కులో స్వయంగా విడిచిపెట్టారు ప్రధాని మోడీ.

దీనిపై ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ” 8 చిరుతలు వచ్చాయి.. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఎందుకు రాలేదు”. అని ట్వీట్ చేశారు. అలాగే ప్రధాని మోదీ జన్మదినం అయిన సెప్టెంబర్ 17 ని జాతీయ నిరుద్యోగ దినోత్సవం గా ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news